Monday, October 12, 2009

Maharastra | Haryana | Arunachala pradesh | Assembly | Poling | Election | ???? ???????????? ?????????? ???????

Maharastra | Haryana | Arunachala pradesh | Assembly | Poling | Election | ???? ???????????? ?????????? ???????

Shared via AddThis

Sunday, July 19, 2009

మంచి paata

సల్యూట్
విశాల్ అండ్ నయనతార
నిన్నెనా ..
నిన్నెనా ..నేను చూస్తుంది నిన్నెనా..
నువ్వేన..నువ్వు ల ఉన్న ఎవరోన..
కోపం లో నిప్పుల కొండ ల..రూపం లో చుక్కల దండ ల..
నవ్వులో చిలకమ్మ ల..చిన్నారుల చేతికి బొమ్మల..
ఇంతకీ నువ్ ఒకదివా వందవ…ఎంతకీ నువ్ ఎవరికి అందవ..
కొత్తగా లవ్ లో పాడ్తుంటే..కొద్దిగా ఇదిలా ఉంటుందే..
ముందుగా మనసుకి తెలీశుంటే..ముందుకే నెడుతూ ఉంటుందే..
తప్పు కాబోలానుకుంటూనే..తప్పుకోలేనానుకుంటుందే..
నొప్పి లో తీపి కలుస్తుందే..రెప్ప లో రేపు మారుస్తుంది..
నిన్నెనా...
తడవక నడిపే గోడుగనుకోన..అడుగుల సడీలో పిడుగైన..
మగటనిపించే..మగతనమున్న..ముని వాణిపించే..బిగువేనా..ముళ్ళాల నీ కల్ళల నన్ను గిల్లీపోతున్నావా..
పువ్వుల న సున్నితాన్నే కాపు కాస్తున్నావా..నాకేమవుతవో..
చెప్పవా ఇపుడయిన..చెప్పమని అడిగేమ్ లాభం లే..
ఎప్పుడో పొందిన అన్స్‌వేరు లెతినే వేసే క్వెస్చన్ లే..
ఊరికే తీసే ఆరా లే..నిద్ర చెడగొట్టే నీరాలే..
కుదురుగా ఉంచని తొందారలే…దరిమిల అంత నీ వల్లే,
అంటూ నిలదీసే నిందల్లే….నిన్నెనా....
బిట్తరాపోయే బెదురు ఒడిలించు..కొత్తగా తెగువే కలిగిన్చుఖత్తెర పదునై బిదాయం తెంచు..
అత్తరు సుడివై నన్ను మూంచు..చంప కుట్తే తేనె పాట్టై ముద్దులే తారామని..
చమత పుట్టే పరుగు పెట్టి హడ్దులే కరగనీ..అని అడగాలన్న..అడిగేయ్‌లేకున్న…
చెప్పమని అడిగేమ్ లాభం లే..ఎప్పుడో పొందిన అన్స్‌వేరు లెతినే వేసే క్వెస్చన్ లే..
ఊరికే తీసే ఆరా లే..నిద్ర చెడగొట్టే నీరాలే..
కుదురుగా ఉంచని తొందారలే…దరిమిల అంత నీ వల్లే,
అంటూ నిలదీసే నిందల్లే…నిన్నెనా.....

ఆశ - అవసరం

జీడిపప్పు గారి పోస్ట్ చదవగానే నాకు ఎప్పుడో ఏదో పత్రికలో చదివిన ఒక కథ గుర్తొచ్చింది...

***

ఒక మధ్యతరగతి వ్యక్తి ఆఫీసుకి నడుస్తూ వెళ్తున్నాడు. దారిలో అతనికి రోడ్డు పక్కగా ఏవో కొన్నివస్తువులు పెట్టుకుని అమ్ముకుంటున్న ఒక ముసలివాడు కనిపించాడు. దగ్గరకి వెళ్లి చూస్తే వస్తువుల్లో ఒక చక్కని అలంకరణ పెట్టె కనిపించింది. పెట్టె పైన అంతా చక్కగా నగిషీ పని చేసి చాలా అందంగా ఉంది. చూడగానే ఏదో యాన్టిక్ వస్తువు చూసినట్టు అనిపించింది అతనికి. దాని ఖరీదు అందుబాటులో ఉంటే కొందామని ముసలివాడిని అడిగాడు...

"దీని ఖరీదు ఎంత?"
"500 బాబు"
"మరీ 500 ... ఛాలా ఎక్కువ కదా"
"దాని మీదున్న పనితనం చుడండి బాబు... అదంతాచేయటానికి పడ్డ కష్టం చుడండి బాబు"
"హ్హ మీరు అలాగే చెప్తారులే... మీ సంగతి నాకు తెలిదా ఏంటి..."
"...."
"సరే... 300 కి ఇస్తావా?"
"మరీ అంత తక్కువకి రాదు బాబు..."
"రాదని అంత ఖచ్చితంగా చెప్తున్నావే... అమ్మే ఉద్దేశం లేదా ఏంటి?"
"అమ్మటానికే కదా బాబు ఇక్కడ కూర్చుంది... కానీ మీరు మరీ తక్కువకి అడుగుతున్నారు... ధరకి అమ్మితే లాభం సంగతి ఏమైనా నాకు దాని విలువ కూడా రాదు బాబు"
"అయితే నువ్వే ఉంచుకో"
అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వ్యక్తి.

***

ఆరోజు సాయంత్రం ఇంటికి వస్తూ తిరిగి అదే దారిలో నడుస్తున్నాడు. ముసలివాడు అక్కడే కూర్చుని ఉన్నాడు.
సరే మళ్లీ ఒకసారి ప్రయత్నిద్దాం అని అక్కడికి వెళ్ళాడు వ్యక్తి.
"ఏంటి పెట్టె ఉందా ఎవరికైనా అమ్మేసావా"
"ఉంది బాబు"
"సరే చివరగా చెప్పు ఎంతకి ఇస్తావ్"
"మీరే చెప్పండి బాబు"
"నేను ఉదయమే చెప్పా కదా... 300 అని"
"కనీసం 400 అన్న ఇవ్వండి బాబు"
హ్హ ముసలోడు దారిలోకి వస్తున్నాడు.. అని మనసులో అనుకుని...
"అదేమీ లేదు...300 కి రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను... అమ్మితే అమ్ము లేదంటే లేదు"
అనేసి అక్కడి నుండి వచ్చేయబోయాడు...
"సరే బాబు తీసుకోండి"
"నాకు తెలుసు కదా మీ సంగతి... 300 చేసే వస్తువుని 500 కి అమ్మాలని చూసావ్...ఎందుకయ్యా మీకు మరీ అంత ఆశ"
అన్నాడు జేబులో నుండి డబ్బులు తీస్తూ...
"ఆశ కాదు బాబు... అవసరం... పెట్టె చేయటానికి ఎంత కష్టపడ్డామో నాకు తెలుసు... దాని విలువ కన్నా కొద్దిపాటిలాభం మాత్రం వేసుకుని అమ్ముదామని అనుకున్నాను... కాని ఈరోజు ఉదయం నుండి ఒక్క వస్తువు కూడా అమ్ముడుపోలేదు... ఇంటి దగ్గర పిల్లలు ఆకలితో నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు... ఆశగా ఎదురుచూసే వాళ్ళ మొహాలు మర్చిపోలేక... నష్టానికైనా మీకు అమ్మితే.. డబ్బుతో వాళ్ళ ఆకలి తీరుతుందని ఇస్తున్నా బాబు"
అన్నాడు ముసలివాడు పెట్టెని ప్యాక్ చేసి ఇస్తూ...

ఒక్క క్షణం మౌనంగా ముసలివాడి వైపు చూసాడు వ్యక్తి...
పీక్కు పోయిన మొహం... లోతుగా ఉన్న కళ్ళు... మాసిన గడ్డం... బక్క చిక్కిన శరీరం...
తను ఎలాంటి వాడి దగ్గర బేరం ఆడాడో తలుచుకుంటేనే తన మీద తనకే కోపం వచ్చింది...
జేబులో నుండి 500 రూ నోటు తీసి ముసలివాడికి ఇస్తూ... పెట్టె అందుకున్నాడు.
"చిల్లర లేదు బాబు... ఈరోజు మొదటి బేరం మీదే"
"దీని ఖరీదు 500 కదా..."
అని ఒక చిరునవ్వు నవ్వి వచ్చేసాడు వ్యక్తి.


గమనిక: ఇది నా సొంత రచన కాదు... ఏదో పత్రికలో చదివిన కథ. కథ as it is గా గుర్తులేదు... నాకు గుర్తున్న రీతిలోరాసాను.

ఊహలకే రెక్కలు వస్తే...

గమనిక: ఇది నా సొంత రచన కాదు. ఏదో సైటులో చదివిన జోక్(?!) కి నా పైత్యం కాస్త జోడించి రాసింది.

***

ఒకతను సూపర్ మార్కెట్ నుండి బయటకి వస్తుండగా ఒక అందమైన అమ్మాయి ఎదురుగా వచ్చి నవ్వుతూ పలకరించింది...
"Good evening"
అతను 'ఎవరు మీరు' అన్నట్టు చూసాడు...

అప్పుడు ఆ అమ్మాయికి అర్థమైంది పొరపాటు జరిగింది అని...
"క్షమించండి... మిమ్మల్ని మొదట చూడగానే మీరు నా పిల్లల్లో ఒకరి తండ్రిలా అనిపించారు" అని సారీ చెప్పేసి వెళ్ళిపోయింది.

అతనికి కొతసేపు ఏమి అర్థం కాలేదు... అలాగే షాక్ తో నిల్చుండిపోయాడు.

అతని మనసులో రకరకాల ఆలోచనలు...

"ఏంటిది... మరీ లోకం ఇలా తయారైంది... ఒక అమ్మాయి తన పిల్లల తండ్రి ఎలా ఉంటాడో కూడా మర్చిపోయిందా!"

అలా అనుకుంటూనే... ఒక్క క్షణం అతనికి కొంచం ఆనందంగా కూడా అనిపించింది... తను ఆ అందమైన అమ్మాయికి ఉన్న సంబంధాల్లో ఒకరిలా అనిపించినందుకు!

ఒకసారి చుట్టూ చూసుకున్నాడు... ఆమె అలా అనటం ఎవరూ గమనించలేదు కదా అనుకుంటూ...

ఒక్క క్షణం మళ్లీ ఒక ఆలోచన వచ్చింది అతని మనసులోకి... "ఒకవేళ నిజంగానే ఒకప్పుడు అతనికి ఆమెతో సంబంధం ఉందా? నిజంగానే తన పిల్లలకి తండ్రా?"

ఇలా రకరకాల ఆలోచనలతో అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

కానీ... అతనికి ఒక విషయం మాత్రం తెలియలేదు...
ఆ అమ్మాయి అదే కాలనీలో ఉన్న ఒక ఎలిమెంటరీ స్కూల్ లో నర్సరీ పిల్లలకి టీచర్ అని!

కుడి ఎడమైతే... పోరపాటేనోయ్!!


గమనిక: ఇది ఎప్పుడో ఎక్కడో చదివిన చిన్న జోకుకి నా పైత్యం జోడించి రాసిన కథ.

సాయంత్రం అయిదైంది.
బుచ్చిబాబు watch వంక చూసి వెంటనే ఫైల్స్ అన్ని మూసేసి ఇంటికి బయల్దేరాడు.
ఇంటికి రాగానే బాగా అలసిపోయినట్టు వేలాడపడిపోయి... సోఫాలో కూర్చుని "కాఫీ" అని ఆర్డర్ చేసాడు.
రెండు నిముషాల్లో కాఫీతో ప్రత్యక్షమైంది బుచ్చిబాబు భార్య భాగ్యం(భాగ్యలక్ష్మి కి బుచ్చిబాబు పెట్టుకున్న ముద్దుపేరు).
కాఫీ అందుకుని తాగుతున్నాడు బుచ్చిబాబు.
"దేశం లో పని మొత్తం మీరొక్కరే చేసి వచ్చినట్టు... అంత పోసు కొట్టాల" అంది భాగ్యం.
అసలే తనేదో బాగా కష్టపడిపోతున్నా అన్న ఫీలింగ్ లో ఉన్న బుచ్చిబాబుకి భాగ్యం మాటలతో చిర్రెత్తుకొచ్చింది.
"కష్టం కాకపోతే మరేమిటి... ఎప్పుడో పుద్దున్నే 10 గంటల కల్లా వెళ్ళాలా ఆఫీసుకి... మళ్లీ ఎప్పుడో సాయంత్రం 5 గంటలకి గాని ఇంటికి రాలేను... ఇంత గొడ్డు చాకిరి చేస్తుంటే... నీకది కష్టంలా కనిపించటంలేదా" అని గయ్ మన్నాడు.
"అబ్బో ఇదీ ఒక కష్టమేనా... ఉదయం నుండి సాయంత్రం దాకా ac లో కూర్చోటమేగా మీరు పొడిచేసే పని" అంది భాగ్యం దెప్పుతున్నట్టు.
"కష్టం అంటే మాది... ఉదయం నుండి గొడ్డు చాకిరీ చేయాలి ఇంటిల్లపాదికి... " అంది మళ్లీ తనే.
"ఆహ... ఏంటో మీరు పడే ఆ కష్టం... ఏవో రెండు కూరగాయలు అలా తరిగేసి కూర చేయటం... రెండు గిన్నెలు తోమటం... అంతే కదా... ఆ చిన్న పనులన్నీ ఉదయమే 11 గంటలకల్లా అయిపోతాయి... తర్వాత మొత్తం ఆ టీవీ లో వచ్చే ఏడుపుగొట్టు సీరియల్స్ చూడటమేగా మీరు పడే కష్టం" అని వాదనకి దిగాడు బుచ్చిబాబు.
"ఏంటి అంత తేలికగా ఉందా మీకు ఇంటి పని అంటే... చేస్తే తెలుస్తది... అది ఎంత కష్టమో... ఊరికే మాటలు చెప్పటం కాదు"
"ఆ పని చేయటం కూడా పెద్ద విషయమేనా... మా ఆఫీసు పని చేయటమే అన్నిటికంటే కష్టం"
"అలాగా... అలా అయితే ఒక రోజు మొత్తం మీరు నాలా ఇంటి పని చేయండి... నేను మీలా ఆఫీసు పని చేస్తాను... అప్పుడు తెలుస్తుంది ఎవరు కష్టపడుతున్నారో" సవాల్ విసిరింది భాగ్యం.
రెండు క్షణాలు ఆలోచించాడు బుచ్చిబాబు...
"ఛ... ఆడవాళ్ళ సవాల్ కి తను వెనక్కి తగ్గితే ఇంకేమన్నా ఉందా... మగాళ్ల పరువు పోదు..." అని మనసులో అనుకుని...
"సరే నేను రెడీ" అన్నాడు.

వెంటనే భాగ్యం తన పతివ్రతా శక్తినంతా కూడగట్టుకుని దేవుడికి పూజ చేసి అప్లికేషను పెట్టింది.

పూజ అయిపోయే సమయానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
"భాగ్యం... ఏమి నీ బాధ... ఈ అప్లికేషను ఏంటి?" అని అడిగాడు దేవుడు
"స్వామీ... నేను, మా అయన సవాల్ చేసుకున్నాం... మీ భక్తురాలు గెలవాలంటే మీరు వెంటనే ఆ అప్లికేషను మీద మీ తదాస్థు సంతకం చేయాలి.." అంది చేతులు జోడించి
దేవుడు అప్లికేషను చదివాడు...
"ఓ... ఒకరోజు మొత్తం నువ్వు మగాడిగా... బుచ్చిబాబు ఆడదానిలా మారాలి... అంతే కదా" అన్నాడు దేవుడు అప్లికేషన్ పరిశీలిస్తూ.
"అంతే స్వామి"
"ఇదీ నీకు కూడా సమ్మతమేనా" అని అడిగాడు దేవుడు బుచ్చిబాబు వైపు తిరిగి
"సమ్మతమే స్వామి..."
"మళ్లీ ఒకసారి బాగా ఆలోచించుకో నాయన..." అన్నాడు దేవుడు బుచ్చిబాబు వైపు జాలిగా చూస్తూ
"లేదు స్వామి... నేను ఎలా అయిన ఈ సవాల్ లో నేగ్గల్సిందే... మీరు సంతకం చేసేయండి" అన్నాడు బుచ్చిబాబు పట్టుదలగా
"సరే నీ ఖర్మ" అని మనసులో అనుకుని దేవుడు తదాస్థు సంతకం చేసేసాడు అప్లికేషన్ మీద.

***

తెల్లవారింది...
బుచ్చిబాబు భాగ్యం రూపంలో ఉన్నాడు... భాగ్యం బుచ్చిబాబు రూపంలో ఉంది.
పొద్దున్నే 5 గంటలకి అలారం గంట కొట్టింది. ఉలిక్కి పడి లేచాడు బుచ్చిబాబు.
అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా అని గొణుక్కుంటూ లేచి... వెళ్లి ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గు పెట్టాడు.
భాగ్యం హాయిగా నిద్రపోతుంది లోపల.
ముగ్గు పెట్టటం అయిపోయాక... పాలు కాయటం, ఇల్లు ఊడవటం, వంటకి కూరగాయలు తరగటం చేస్తున్నాడు బుచ్చిబాబు.
టైం 8 అయింది. భాగ్యం లేచింది బద్ధకంగా.
తను లేచి స్నానం చేసి వచ్చేలోగా... టిఫిన్ రెడీ చేసాడు బుచ్చిబాబు.
టిఫిన్ తినేసి లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీసు కి వెళ్ళిపోయింది భాగ్యం 9 గంటల కల్లా.
ఈలోగా హడావిడిగా పిల్లలని రెడీ చేసి... వాళ్లకి టిఫిన్ పెట్టి, పాలు తాగించి స్కూల్ కి పంపించాడు బుచ్చిబాబు.
అప్పటికే తన ఒంట్లో శక్తి మొత్తం అయిపోయింది... నీరస పడిపోయాడు.
కానీ ఎలా అయిన పందెం నేగ్గాలన్న పట్టుదలతో మళ్లీ శక్తి తెచ్చుకుని ఇంటి పని చేస్తున్నాడు.
పిల్లలు వెళ్ళిపోయాక... ఇల్లు తుడిచేసాడు.
బట్టలు నానపెట్టి... గిన్నెలు తోమాడు.
తర్వాత బట్టలు కూడా ఉతికేసి ఆరేసాడు.
అప్పటికే టైం 12 అయింది.
స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకున్నాడు.
భోజనం టైం అయింది... అప్పుడు గుర్తొచ్చింది బుచ్చిబాబుకి... తను పొద్దున్నుండి ఏమి తినలేదు అని... "హు రోజు టైం కి టిఫిన్, టీ పడేవి కడుపులో... ఏం ఖర్మరా బాబు" అని మనసులో అనుకుని... భోజనం చేసాడు.
కాసేపు నడుం వాలుద్దాం అనుకునే లోగా...
"భాగ్యమక్కా... రేపు మా ఇంటికి చుట్టలోస్తున్నారు... పిండి వంటలు చేయాలి.. కొంచం సాయం పట్టవు" అంటూ వచ్చింది పక్కింటి పంకజం.
తప్పేదేముంది... ఆ పనిలో పడ్డాడు బుచ్చిబాబు.
ఆ పని అయ్యేటప్పటికి 3 దాటింది టైం. పిల్లలు వచ్చే టైం అయింది.
వాళ్ళు రాగానే పాలు తాగించాడు. కొంచం అల్పాహారం తయారు చేసి పెట్టాడు.
వాళ్ళు ఆ టిఫిన్ తినేసి ట్యూషన్ కి వెళ్లిపోయారు.
టైం 5 అయింది.
మళ్లీ ఒకసారి ఇల్లు ఊడ్చి... గిన్నెలు తోమేసాడు.
6 అయింది. భాగ్యం వచ్చింది ఆఫీసు నుండి.
తనకి కొంచం కాఫీ కలిపి ఇచ్చి... సాయంత్రం చేసిన అల్పాహారం పెట్టాడు.
తను అది తినేసి relaxed గా సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంది.
బుచ్చిబాబుకి ఒళ్ళు మండింది... కానీ ఏం చేయలేడు కదా...
లోపలికి వెళ్లి రాత్రి భోజనం తయారు చేసే పనిలో పడ్డాడు.

అలా ఆ రోజంతా క్షణం తీరిక లేకుండా గడిచింది బుచ్చిబాబుకి.

***

తెల్లవారింది...

బుచ్చిబాబు కి ఇంక ఆ పనులు చేయటం వల్లకాలేదు...
వెంటనే దేవుడి దగ్గరికి వెళ్లి... "స్వామీ... 24 గంటల గడువు అయిపొయింది... వెంటనే నన్ను నా పూర్వ రూపానికి మార్చేయండి... ఈ గొడ్డు చాకిరి చేయటం నా వల్ల కాదు... నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను..." అన్నాడు దీనంగా చేతులు జోడించి.
దేవుడు ప్రత్యక్షమయ్యాడు...
"స్వామీ అర్జెంటుగా నన్ను మాములు రూపానికి మార్చేయండి" మళ్లీ అడిగాడు ఆగలేక...
"బుచ్చిబాబు... చిన్న పొరపాటు జరిగిపోయిందయ్యా... మరో 9 నెలల దాక నువ్వు ఈ రూపంలోనే ఉండాలి!"
అని వెంటనే మాయమైపోయాడు దేవుడు.
బుచ్చిబాబు పిచ్చి చూపులు చూస్తూ... భాగ్యం వైపు తిరిగాడు...
విష్ణుమూర్తి లాగా మంచం మీద విలాసంగా పడుకుని... కొంటెగా నవ్వింది భాగ్యం.